Arizona Flag Image Unique

ఆరిజోనా అమెరికా లోని రాష్ట్రాల్లో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా నైఋతి ప్రాంతంలో ఉంది. ఈ రాష్ట్రం ఎడారి ప్రదేశాలకు, అతి తీవ్రమయిన వేసవికి, మధ్యస్థమైన చల్లదనం కలిగిన శీతాకాలానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్రాని…
ఆరిజోనా అమెరికా లోని రాష్ట్రాల్లో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా నైఋతి ప్రాంతంలో ఉంది. ఈ రాష్ట్రం ఎడారి ప్రదేశాలకు, అతి తీవ్రమయిన వేసవికి, మధ్యస్థమైన చల్లదనం కలిగిన శీతాకాలానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్రానికి న్యూమెక్సికో, యూటా, నెవాడా, కాలిఫోర్నియా, కొలరాడో రాష్ట్రాలు సరిహద్దులు. మెక్సికోలోని సొనోరా, బాజా కాలిఫోర్నియా అంతర్జాతీయ సరిహద్దులు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్ కాన్యన్ లోయ, అనేకమయిన అడవులు, స్మారక స్థూపాలు, రెడ్ ఇండియన్ ల ఆవాసాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దీని రాజధాని, అతిపెద్ద నగరమూ ఫీనిక్స్.
దీనిలోని డేటా: te.wikipedia.org